Tuesday, 3 November 2026

వారసత్వ రాజకీయాలను ఓడించండి

4

జార్ఖండ్‌ ఎన్నికల ప్రచార సభలో నరేంద్రమోడీ పిలుపు

జార్ఖండ్‌, నవంబర్‌ 21 (జనంసాక్షి) : వారసత్వ రాజకీయాలను ఓడించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లో వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. శుక్రవారం ఆయన ఝార్ఖండ్‌లోని డాల్టన్‌గంజ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పెద్దఎత్తున సభకు తరలివచ్చిన ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు మద్దతుగా నిలిచినందుకు మోదీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ నదులు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందడంలేదన్నారు. భారత రైతుల కోసం ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తలను కలిసినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రజల ఆశలను ఏమాత్రం నెరవేర్చలేకపోయాయని, ఆదివాసీల అభివృద్ధికి కృషిచేస్తానని మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ఎన్నికలు కీలకమని మోదీ పేర్కొన్నారు. నవంబరు 25న 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొదటి దశ పోలింగ్‌ జరగనుంది. విదేశీ పర్యటనలో విదేశీయులతోపాటు ప్రవాస భారతీయులను తన ప్రసంగాలతో ఆకట్టుకున్న మోడీ ఎన్నికల సభలో తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఆకట్టుకుంటున్నారు. భారతీయ జనతాపార్టీ అధికారం చేపట్టేందుకు నేతలు అన్నిరకాలుగా కృషిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *