Monday, 2 November 2026

రియల్‌ దందాలో మంత్రి తలసాని తనయుడు

Talasani_Srinivas_Yadav_Profile-300x297ఎంపి కొత్తపల్లి గీత భర్త కిడ్నాప్‌పై ఆరోపణలు
కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు
ఆరోపణళ్లో నిజం లేదన్న మంత్రి తలసాని

హైదరాబాద్‌,మార్చి31(ఆర్‌ఎన్‌ఎ): రియల్‌ దందాలో మంత్రి తలసాని అతడి అనుచరలు వ్యవహారం మరోమారు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి అరకు ఎంపీ భర్త కోటేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రి తనయుడి మధ్య నెలకొన్న భూ వివాదం చర్చనీయాంశంగా మారింది. ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలకు దిగడంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. అంధప్రదేశ్‌ రాష్ట్రంలోని అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు కిడ్నాప్‌నకు గురైనట్లు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోతొలుత ఫిర్యాదు చేశారు. షేక్‌పేట్‌ ప్రాంతంలోని ఓ ఐదెకరాల భూమికి సంబంధించిన వివాదంలో బుధవారం న్న సాయంత్రం చర్చల కోసం వెళ్లిన రామకోటేశ్వరరావు ఎంతకూ తిరిగిరాకపోవడంతో ఎంపీ గీత పశ్చిమ మండలం డీసీపీకి

ఫిర్యాదు చేశారు. ఆర్‌.ఆర్‌. కన్‌స్టక్షన్ర్‌ సంస్థ తమకు చెందిన 5ఎకరాల భూమిని బలవంతంగా వారి పేరుతో రాయించుకుందని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడు సాయి చర్చల కోసం పిలవగా తన భర్త వెళ్లాడని ఎంపీ పోలీసులకు వెల్లడించారు. ఆర్‌.ఆర్‌. కన్‌స్టక్షన్ర్‌ సంస్థ  రాజరాజేశ్వరి బిల్డర్స్‌గా నగరంలో చెలామణి అవుతోంది. దీనిని రామకృష్ణ అనే బిల్డర్‌ తలసానికి బినావిూగా నడుపుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. బుధవారం  సాయంత్రం వెళ్లిన రామకోటేశ్వరరావు ఎంతకూ తిరిగిరాకపోగా.. ఫోన్‌ స్విచాఫ్‌ కావడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం అర్థరాత్రి 12గంటల సమయంలో గచ్చిబౌలి ప్రాంతంలో విడిచిపెట్టగా రామకోటేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. అర్థరాత్రి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో రామకోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అయితే భూ వివాదంలో మంత్రి కుమారుడితో పాటు ఆర్‌ ఆర్‌ కన్‌స్టక్షన్ర్‌కు చెందిన రామకృష్ణ చర్చల కోసం వెళ్లిన తనను బయటకు రాకుండా చేశారని తెలిపారు. బలవంతంగా తనతో ఖాళీ దస్తావేజులపై సంతకాలు తీసుకున్నారని, అర్థరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలో విడిచిపెట్టారని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భూ దస్తావేజులు కొన్ని లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రామకోటేశ్వరరావు ఆరోపణల్లో వాస్తవం లేదు: తలసాని

అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావును అపహరించారనటంలో వాస్తవంలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గురువారం ఉదయం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. అపహరణకోసం ఎవరైనా తాజ్‌కృష్ణ ¬టల్‌కు తీసుకెళ్తారా అని ప్రశ్నించారు. మొత్తం వివరాలన్నీ శుక్రవారం మధ్యాహ్నం ఇస్తానని విూడియాకు వెల్లడించారు.  డబ్బు విషయమై చాలా రోజులుగా రామకోటేశ్వరరావు ఫోస్ట్‌ ఫోన్‌ చేసుకుంటూ వస్తున్నారు. వైట్‌ పేపర్‌ విూద రాసించింది నిజమే..కానీ ¬టల్‌లో రిజిస్టేష్రన్‌ చేయరు కదా అందుకే తెల్లకాగితం విూద రాయించుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.అరకు ఎంపీ భర్త అపహరణతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాజ్‌కృష్ణ ¬టల్‌లో సీసీ కెమెరాలు ఉంటాయి.. చూసుకోవచ్చన్నారు. తన కుమారుడు సహా నలుగురు ¬టల్‌ లాన్‌లో కూర్చుని మాట్లాడుకున్నారని, బలవంతంగా దస్త్రాలపై ఎలాంటి సంతకాలు చేయించుకోలేదని వివరించారు. వ్యాపార లావాదేవీల కోసం బెదిరించారనటంలో వాస్తవం లేదన్నారు. రామకోటేశ్వరరావు బ్యాంకు అధికారులను మోసం చేశారు… మమ్మల్ని మోసం చేయాలంటే కుదరదని వ్యాఖ్యానించారు. గతంలో గీత భర్తకు డబ్బులు ఇచ్చాము..రామకోటేశ్వరరావు అందరినీ మోసం చేశారని తలసాని తెలిపారు. బ్యాంకులను మోసం చేసినట్లుగా తమను కూడా మోసం చేయాలని రామకోటేశ్వరరావు అనుకుంటున్నా రేమో అవన్నీ కుదరవ్‌ అని తలసాని చెప్పారు. ఆయన సైట్‌తో మాకేం అవసరముంటది..డబ్బులు తీసుకుని అప్పుడు ఇస్తా..ఇప్పుడు ఇస్తా అని  కాలం గడిపేస్తున్నారన్నారు. మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనిని తలసాని తేల్చిచెప్పారు. కిడ్నాప్‌ చేశామన్నది అవాస్తవం..ఈ మాట వింటుంటే విచిత్రంగా ఉంది. కిడ్నాప్‌ చేస్తే ¬టల్‌కు ఎందుకు తీసుకెళతారన్నారు.కిడ్నాప్‌, బెదిరింపు ఆరోపణలు సరికావని ఆయన తెలిపారు. కావాలంటే ¬టల్‌ సీసీ ఫుటేజీ చూడొచ్చని తలసాని చెప్పారు.  అయితే రామకోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుమారుడు సాయి, ఆర్‌.ఆర్‌. కన్‌స్టక్షన్ర్‌కు చెందిన రామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

తలసాని డ్రామాలు ఆడుతున్నారు: గీత

అయితే తన భర్త రామకోటేశ్వరరావు కిడ్నాప్‌ వ్యవహారంలో డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. తలసాని అరగంట ప్రెస్‌విూట్‌తో అబద్ధం నిజం కాదన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని… చట్టంపై తనకు నమ్మకం ఉందని గీత పేర్కొన్నారు. తమ ఫోన్లు లాక్కొని నిర్బంధించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఆర్‌ఆర్‌ కన్‌స్టక్షన్స్ర్‌తో 2013 నుంచి సంబంధాలున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ చర్య తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కొత్తపల్లి గీత అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *