రిషితేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ
గుంటూరు : నాగార్జునయూనివర్శిటీ, ఆగస్టు 5 : నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ సాగిస్తుంది. వీసీ, రిజిష్ర్టార్‌లతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. వర్శిటీలో బందోబస్తును జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. ఈ నెల పదో తేదీలోగా నివేదిక సర్కారుకు ఇవ్వనున్న దృష్ట్యా రేపటిలోగా కమిటీకి ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఫిర్యాదులను ఈమెయిల్ ద్వారా కూడా స్వీకరిస్తామన్నారు