తూర్పుగోదావరి, మార్చి 23 : తూర్పుగోదావరి జిల్లా ఏవోబీ సరిహద్దుల్లో గంజాయిని అక్రమంగా రవాణ చేస్తున్న ముగ్గురి ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు వాహనాలు, రూ.42 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాలో ఇప్పటివరకు 24 మందిని అరెస్టు చేశామని ఏఏస్పీ ఫకీరప్ప చెప్పారు.




