లాంఛనంగా ప్రారంభించిన బాలకృష్ణ
అనంతపురం,సెప్టెంబర్27(జనంసాక్షి): చిలమత్తూరు మండలంలో రూ. 28.60 లక్షలతో నిర్మితమైన స్థానిక వ్యవసాయ గోదాంను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము పండించిన ధాన్యం, వేరుశెనగలు నిల్వ చేసుకోవడానికి
గోదాంను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. గోదాంతో పాటు ముస్లిం సోదరులు వివాహాలు చేసుకునేందుకు షాదీఖానాను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రారంభ సమయంలో చిలమత్తూరు బీసీ కాలనీకి చెందిన మహిళలు తమకు తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని బాలకృష్ణ హావిూ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీఏ రవి కుమార్, మండల వ్యవసాయాధికారిణి శ్రీలత, జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ రెడ్డి, మండల కన్వీనర్ రంగారెడ్డి, రాష్ట్ర వాల్మీకి సంఘం అధ్యక్షుడు అంబికా లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.




