తూప్రాన్ : పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఏం చేశారని రైతు గర్జనలు పెడుతున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకున్నందుకు ఆదిలాబాద్‌లో రైతు గర్జన పెడుతున్నారా? అంటు అడిగారు. మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందిన రావెల్లి రైతు భాగన్నగారి శ్రీనివాస్‌రెడ్డి భార్య రమకు రూ. 4 లక్షల పరిహారపు చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రామాయపల్లి అతిథి గృహాంలో విలేకరులతో మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రైతులకు ఏనాడైనా నాణ్యమైన కరెంటును అందించారా? అంటూ ప్రశ్నించారు. కరెంటు కోసం రైతులను 10 ఏళ్లు రోడ్డు ఎక్కించారని ఆయన విమర్శించారు. కరెంటు సరఫరాలో గంట, గంటకు ట్రిప్పులతో రైతుల ఉసురుపోసుకున్నారన్నారు. కరెంటు సరఫరా సక్రమంగా లేక రైతులు అప్పులపాలయ్యారన్నారు. మేము 12 గంటల కరెంటును రైతులకు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో పట్టణాలు, పరిశ్రమలకు కరెంటు కోతలున్నాయని, కరెంటు కోసం దాడులు జరిగిన విషయాన్ని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కరెంటు కోత అనకుండా నాణ్యమైన కరెంటు అందజేస్తుందన్నారు.రైతులకు ఏం చేశారని రైతు గర్జన? : హరీశరావు
తూప్రాన్ : పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఏం చేశారని రైతు గర్జనలు పెడుతున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకున్నందుకు ఆదిలాబాద్‌లో రైతు గర్జన పెడుతున్నారా? అంటు అడిగారు. మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందిన రావెల్లి రైతు భాగన్నగారి శ్రీనివాస్‌రెడ్డి భార్య రమకు రూ. 4 లక్షల పరిహారపు చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రామాయపల్లి అతిథి గృహాంలో విలేకరులతో మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రైతులకు ఏనాడైనా నాణ్యమైన కరెంటును అందించారా? అంటూ ప్రశ్నించారు. కరెంటు కోసం రైతులను 10 ఏళ్లు రోడ్డు ఎక్కించారని ఆయన విమర్శించారు. కరెంటు సరఫరాలో గంట, గంటకు ట్రిప్పులతో రైతుల ఉసురుపోసుకున్నారన్నారు. కరెంటు సరఫరా సక్రమంగా లేక రైతులు అప్పులపాలయ్యారన్నారు. మేము 12 గంటల కరెంటును రైతులకు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో పట్టణాలు, పరిశ్రమలకు కరెంటు కోతలున్నాయని, కరెంటు కోసం దాడులు జరిగిన విషయాన్ని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కరెంటు కోత అనకుండా నాణ్యమైన కరెంటు అందజేస్తుందన్నారు.



