Tuesday, 3 November 2026

రైతుల అంగీకారంతోనే..!!

భూమి కోల్పోయే నిర్వాసితులకు పూర్తిగా ప్రభుత్వమే అండగా నిలుస్తూ… అన్ని హంగులతో ఇంటిని నిర్మించి ఇచ్చేలా తెలంగాణ నూతన భూ సేకరణ చట్టం రూపొందుతోంది. గతంలో వచ్చిన వివాదాలకు చెక్‌ పెట్టే రీతిలో నూతన చట్టం ఆమోదానికి సర్కార్‌ సిద్దమైంది. ఈ శీతాకాల శాసనసభ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించింది. చట్టం ముసాయిదాను శనివారం క్యాబినెట్‌ ఆమోదించడంతో బిల్లు లాంఛనమేనని తెలుస్తోంది. ప్రజోపయోగ అవసరాలకు సేకరించే భూముల నిర్వాసితులకు ఈ చట్టం ద్వారా మరింత అండగా నిలవాలని ప్రభు271892-kcr-700త్వం యోచిస్తోంది. ఈ చట్టంలో అంతిమంగా నిర్వాసితుల ప్రయోజనాలే కీలకాంశా లుగా ఉన్నాయి. గతంలో ప్రాజెక్టుల భూ సేకరణలకు జిల్లా స్థాయి భూ సేకరణ కమిటీ (డీఎల్‌ఎల్‌పీసీ) కీలక నిర్ణయం తీసుకునే వెసులుబాటును తాజాగా సవరిస్తోంది. పునరావాసంపై పూర్తి జాగరూకత వహించాలని, ఇండ్లు, స్థిరాస్తులు, జీవనోపాదులు కూడా ఇందులో మదింపు చేయాలని, అంతమేర నష్ట పరిహారం చెల్లించాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది. నిర్వాసితులకు ఇండ్లను ఇతర చోట్ల స్వంతంగా ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలనేది ఇందులో కీలకాంశం. రైతులు కోల్పోయే భూముల విలువలో జీవనోపాదులు, స్థిరాస్తి, పునరా వాసంపై పూర్తిగా జోడించాలని నిర్ణయించనున్నారు. ఇవ న్నీ భూమిని కోల్పోయే రైతుకు వివరించి అతని అంగీకారం తీసుకోవాలని తద్వారా తర్వాత ఎలాంటి చిక్కులు రాకుండా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *