ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఈరోజు పర్యటిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైఎస్‌ఆర్ కాలనీలో వరత బాధితులకు చిరంజీవి నిత్యావసర వస్తువులను పంపీణీ చేశారు. నీలం తుఫాను ప్రభావంతో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలు తనకు తెలుసునని , కేంద్రంతో మాట్లాడి సహాయం చేసేందుకు కృష్టిచేస్తానని వెల్లడించారు.




