హైదరాబాద్ :
రైతు సమస్యలు ఒక్క రాత్రిలో తీరేవి కావని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వారు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతుల సమస్యలు తీర్చడం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోందని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన ప్రసంగించారు. ఈ చర్చల్లో ప్రతిపక్షాల నుండి మంచి సలహాలు వస్తాయని ఆశించానని అలాంటివి ఏవీ రాలేదని చెప్పారు. రాష్ట్ర హైకోర్టులో ఏపీ, తెలంగాణలో రైతుల సమస్యలు..ఆత్మహత్యలు..వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పిల్ వేయడం జరిగిందన్నారు. రెండు ప్రభుత్వాలు కూడా సమస్య మూలాల్లోకి వెళ్లాలని, అందుకు సంబంధించిన కార్యచరణ ఏముందో న్యాయస్థానానికి తెలియచేయాలని ఆదేశాలిచ్చారని తెలిపారు. 58 సంవత్సరాల పరిపాలలో అతి భయంకరమైన దాడికి తెలంగాణ గురైందన్నారునీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. 1960 లో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదని, 58 సంవత్సరాల్లో జరిగిన ప్రాంతీయ వివక్ష తెలంగాణను వెంటాడిదన్నారు. తీవ్రమైన కరవు ఏర్పడడం..బావులు ఎండిపోవడం..భూగర్భ జలాలు ఎండిపోయాయన్నారు. దానికి తోడు కరెంటు కోతలు ఉండేవన్నారు. వ్యవసాయ శాఖలో 1300 ఉద్యోగాలు ఉంటే 5వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనమైందన్నారు. తాను 40 ఎకరాల్లో అల్లం పంట వేసినట్లు, కానీ ఆ పంట పండుతుందో తెలియదన్నారు. రైతుల సమస్యల తీరాలంటే ప్రాజెక్టుల నుండి నీళ్లు రావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 364 విత్తన కంపెనీలున్నాయి. 650 మెట్రిక్ టన్నుల విత్తనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. 17వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈనెల 5వ తేదీన అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన మీటింగ్ కు అఖిలపక్ష నేతలను కూడా ఆహ్వానించాలని సంబంధిత మంత్రి పోచారంకు కేసీఆర్ సూచించారుపోయిన సంవత్సరం బడ్జెట్ పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమని, అనంతరం రాష్ట్రపతి పాలన, ఎన్నికలు రావడం జరిగిందన్నారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిందని, కొంతమంది నిపుణులు..మేధావులతో కూర్చొని బడ్ఝెట్ రూపొందించినట్లు చెప్పారు. ఉద్యోగాల కేటాయింపు కూడా ఆలస్యమైందన్నారు. ఆర్థిక ప్రగతి పూర్తిగా తెలియదని ఆనాడే తాను చెప్పినట్లు సభకు తెలిపారు. మొట్టమొదటిగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరెంటు కోతలపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఇక్కడ ఏపీ ప్రభుత్వం పంపిణీని ఎగబెట్టిందని, ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వకపోవడంతో కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనితో పలు రాష్ట్రాల నుండి కొనుగోలు చేసినట్లు తెలిపారు.
వెయి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు..కిరణ్ కుమార్ రెడ్డి హాయాంలో షోలాపూర్ రాయచూరు కారిడార్ వచ్చిందని, వెయి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని ఆనాడు చెబితే పెడచెవిన పెట్టారన్నారు. చివరకు వేయి మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీనిపై తాను విద్యుత్ నిపుణులతో మాట్లాడితే దేశంలో 2 లక్షల విద్యుత్ స్టాక్ ఉందని అందులో 1.50మెగావాట్లు వాడుతున్నారని తెలిపినట్లు పేర్కొన్నారు. కరెంటు కోతల వల్ల రైతులు పడే ఇబ్బందులను సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చే వారని, మొక్క జొన్న, ఇతర పంటలు ఎండిపోయాయంటూ సభలో ప్రదర్శించే వారని గుర్తు చేశారు. కరెంటు సమస్యలు లేకుండా సభ జరగడం గర్వంగా ఉందన్నారు. 2018 ముగిసే నాటికి 3 ఫేజ్ కరెంటు ఇవ్వడం జరుగుతుందని, 9గంటల కరెంటు విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని సభలో వెల్లడించారు.36 లక్షల మందికి సంబంధించి రైతు రుణాలు మాఫీ చేయడం జరిగిందని, ఇప్పటికే రైతు రుణమాఫీ రూ. 8 వేల కోట్లకు పైగా విడుదల చేసినట్లు సభకు తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించినట్లు, రాష్ట్రానికి వాణిజ్య శాఖ నుంచి రూ. 4,500 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అందులో 200-300 కోట్లు వచ్చాయన్నారు. వెంటనే మిగతా డబ్బులు రాబట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, 14వ ఆర్థిక సంఘం ప్రకారం అదనపు ఎఫ్ఆర్బీఎం ద్వారా రూ. 3 వేల కోట్ల వరకు రావాల్సి ఉందని సభకు తెలిపారురాష్ట్రంలో 1.08వేల వ్యవసాయ ట్రాక్టర్లు ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రవాణా పన్ను రద్దు చేసి 70 కోట్లు ట్యాక్స్ ఫ్రీ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ శాఖలో 15వందల పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు. ప్రతి 5వేల ఎకరాలకు ఒక అధికారి ఉండాలని నిబంధన పెట్టినట్లు తెలిపారు. అంతేగాకుండా రైతులకు మధ్యాహ్నాం భోజనం ఏర్పాటు చేస్తామని, ఉత్పత్తి భూమిలోనే దిగుబడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.మిషన్ కాకతీయ పనులు అద్భుతంగా జరుగుతున్నాయని, మిషన్ కాకతీయ పనులు ప్రారంభం కాకముందే కమీషన్ కాకతీయ అన్నారని విమర్శించారు. కానీ మిషన్ కాకతీయ వల్ల చాలా చెరువులు నీటితో నిండిపోయాయని, చెరువుల కింద రైతులు పంటలు వేసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
రైతు సమస్యలు..ఒక రాత్రిలో తీరేవి కావు – కేసీఆర్…




