Thursday, 5 November 2026

రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి మృతి

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి ఎస్‌.పిచ్చయ్య(16) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం… సోదరుడితో కలిసి స్వగ్రామం వేముల నుంచి బొడ్డువానిపాలెం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పిచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సీహెచ్‌ వెంకటేశ్వర్లు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసున మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *