నర్సీపట్నం గ్రామీణం : విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం జోగినాధునిపాలెం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నర్సీపట్నం నుంచి కోటవరుట్లకు వెళ్తున్న 108 వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాడేరుకు చెందిన బి. అర్జున్ (22), పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన జీ. వెంకటేశ్ (25)లు అక్కడిక్కడే మృతి చెందారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన మరో యువకుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.




