కడప : దువ్వూరు మండలం జిల్లెల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్‌కు గాయాలయ్యాయి. కుటుంబంతో కలిసి ఎమ్మెల్సీ హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొంది.ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ సహా గాయపడ్డ కుటుంబసభ్యులను కడప ఆసుపత్రికి తరలించారు.




