కడప : వైఎస్‌ఆర్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రైల్యేకోడూరు మండలం కుక్కలదొడ్డి సమీపంలో లారీ – ఇన్నోవా వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మెదక్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడినవారిని రుయా ఆస్పత్రికి తరలించారు.




