Tuesday, 3 November 2026

అనంతలో సాక్షి ఉద్యోగి దారుణహత్య

అనంతపురం : అనంతపురంలో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. సాక్షి కార్యాలయంలో డిజైనర్‌గా పనిచేస్తున్న నరసింహులును ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కార్యాలయంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అతనిని వెంబడించిన ప్రత్యర్థులు.. రుద్రంపేట సమీపంలోకి రాగానే వేటకొండవళ్లలో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో నరసింహులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. భూవివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *