పూతలపట్టు : చిత్తూరు జిల్లాలోని కర్నూలు-పూతలపట్టు జాతీయరహదారిపై రంగంపేట వద్ద కారు, స్కార్పియో వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఒకరి మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. చిత్తూరు నుంచి పీలేరు వైపు వెళ్తున్న స్కార్పియోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్కార్పియో డ్రైవర్ అక్కడికకడే మృతి చెందగా గాయాలైన ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.




