Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని సతీమణి దుర్మరణం

accident-650x345హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర రావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయన సతీమణి సత్యవాణితోపాటు కారు డ్రైవర్ దాసు కూడా దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.

విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తోన్న పిన్నమనేని కారు పహాడీ షరీఫ్ వద్ద బోల్తాకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ పిన్నమనేనిని శంషాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *