Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి మృతి

కోదాడ : కోదాడ మండలంలోని తమ్మర వద్ద ఖమ్మంరోడ్డు పై జరిగిన ప్రమాదంలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్ధికి తీవ్రగాయాలయ్యాయి కోదాడ అనురాగ్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన 3వ సంవత్సరం విద్యార్థులు ఎండీ నజీర్‌, వినోద్‌కుమార్‌లు ద్విచక్రవాహనంపై వెళ్తూ  ఆటోను తప్పించబోయి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది, నజీర్‌ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన వినోద్‌కుమార్‌ కోదాడలో చికిత్స పొందుతున్నాడు. వీరి స్వగ్రామం ఖమ్మం జిల్లా నేలకోండపల్లి మండలం రామచంద్రాపురం అని పోలీసులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *