రోహింగ్యా ముస్లింలపై దాడులకు నిరసన

గుంటూరు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి ): బంగ్లా,మయన్మార్‌ దేశాల్లో రొహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దారుణ మారణకాండ పై తెనాలిలో శుక్రవారం ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించారు. జవిూయత్‌ ఉలేమాయే-ఇంద్‌ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన చేశారు. పట్టణ వాహాబ్‌చౌక్‌ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు నల్లజెండాలతో ర్యాలీ చేపట్టారు. వారిపై మారణకాండను సత్వరమే నిలిపి వేయాలనీ, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో నర్సిములుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు