Monday, 2 November 2026

రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా యూనివర్సిటీల బంద్

6హైదరాబాద్ : రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీల బంద్ కొనసాగుతోంది. హెచ్ సీయూను బంద్ చేసిన విద్యార్థులు భారీ సంఖ్యలో క్యాంపస్‌ ఎదుట ఆందోళన చేస్తున్నారు. వీసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దళిత సంఘాలు, దళిత టీచర్లు ఫెడరేషన్స్, పలు విద్యార్థి సంఘాలు మద్దతిచ్చాయి. రేపటి నుంచి నిరాహారదీక్షలకు పూనుకుంటున్నట్లు టీచర్స్ ఫోరం నేతలు పేర్కొన్నారు.హైదరాబాద్‌ జెఎన్ టియులో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.. విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు… హెచ్ సీయూ వీసీని సస్పెండ్‌ చేయాలంటూ జెఎసి బంద్‌ పిలుపుకు విద్యార్థులు మద్దతు పలికారు.. వీసీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.. విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైనవారిని శిక్షించాలంటూ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది జేఏసీ.. హెచ్ సీయూలో కొత్త వీసీ రాక కుల వివక్షతకు, మత రాజకీయాలకు ఆజ్యం పోసేలా ఉందన్నారు విశాఖ ఏయూ విద్యార్థులు.. యూనివర్శిటీలో విద్యార్థులు బలికాకుండా నిర్భయ చట్టంలా రోహిత్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.. జెఎసి పిలుపుతో ఆంధ్ర వర్శిటీలో బంద్‌ కొనసాగుతోంది. విద్యార్థులకు అనుగుణంగా నడచుకునే వీసీ కావాలని విద్యార్థులు కోరారు. రాజకీయ నేతల అనుచరుల్ని వర్శిటీలోకి రానివ్వొద్దన్నారు. నిర్భయ చట్టంలా రోహిత్ చట్టం తేవాలన్నారు. విద్యార్థులు బలికాకుండా ఆపాలని కోరారు. బిజెపి కాషాయ దళమే రోహిత్ మృతికి కారణమన్నారు. బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పారావు, శ్రీవాత్సవల్ లు బిజెపి ముద్దు బిడ్డలని విమర్శించారు. వీసీ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *