Tuesday, 3 November 2026

రోహిత్‌ ( ఆత్మ ) హత్యపై పెల్లుబికిన నిరసన

C

గల్లీ నుంచి దిల్లీ వరకు ఆందోళనలు

దత్తాత్రేయ లేఖపై విద్యార్థుల ఫైర్‌

విసి, కేంద్రమంత్రి దత్తాత్రేయపై కేసు నమోదు

ద్విసభ్య విచారణా సంఘం నియామకం

న్యూఢిల్లీ/ హౖదరాబాద్‌, జనవరి18 (జనంసాక్షి): రోహిత్‌ ఆత్మహత్యను నిరసిస్తు దేఖీశ రాజధాని ఢిల్లీలో పలు విద్యార్ధి సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పలు సంఘాలకు చెందిన విద్యార్థులు పెద్ద పెట్టున భాజపా సంఘ్‌ పరివార్‌ శక్తులకు వ్యతిరేఖంగా నినదించారు.

వారిని అదుపు చేసేందుకకు వాటర్‌ కేనల్లను ప్రయోగించిన విద్యార్థులు ఆందోళన విరమించక పోవడంతో పోలీసులు అరెస్టు చేసి అక్కడ నుంచి తరలించారు.కాగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో రోహిత్‌ అనే విద్యార్థి ఆత్మహత్య కేసులో సోమవారం తీవ్ర ఉద్రక్తత కొనసాగింది. విద్యార్థులతో పాటు పలువురు ఆందోళనకు దిగి ఈ ఘటనపై విచారణకు డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆందోళనతో క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలావుంటే పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూనివర్శిటీలో చోటుచేసుకుంటున్న ఘటనలపై మానవ వనరుల అభివృద్ధిశాఖ ఓఎస్‌డీ షకీలా శంషు, డిప్యూటీ సెక్రటరీ సూరత్‌ సింగ్‌ ఆధ్వర్యంలో ద్విసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. మరోవైపు  ఈ కేసులో హెచ్‌సీయూ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు మరో ఇద్దరిని నిందితులుగా పేర్కొంటూ గచ్చిబౌలి పోలీసులు ఐపీసీ 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఏ1-అప్పారావు (వీసీ), ఏ2-బండారు దత్తాత్రేయ (కేంద్ర మంత్రి), ఏ3-సుశీల్‌ (ఏబీవీపీ నాయకుడు), ఏ4-విష్ణు(బీజేవైఎం నాయకుడు)గా పేర్కొన్నారు. కాగా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై ప్రత్యేక విచారణ కోసం ఒక బృందాన్ని హెచ్‌సీయూకు పంపించారు. రోహిత్‌ ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో వర్సిటీలో విద్యార్థులు సోమవారం ధర్నాకు దిగారు.  దీంతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివారం నుంచి ఆందోళన కొనసాగుతూనే ఉంది. రోహిత్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. రోహిత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించేందుకు పోలీసులు తీసుకు వెళ్తుండగా విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇకపోతే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ లో సస్పెన్సన్‌కు గురైన మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెంన్షన్‌ ఎత్తివేయాలని ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్‌ కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో  రోహిత్‌ అనే ఓ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వర్సిటీలో కొనసాగుతోన్న ఉద్రిక్తతపై ఆమె స్పందించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్రానికి లేఖ రాయడం వల్లే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. దత్తాత్రేయ ఓ విద్యార్థి సంఘానికి మద్దతునిచ్చే ఉద్దేశ్యంతోనే కేంద్రానికి లేఖ రాశారని వివరించారు. ఆయన ఒత్తిడి వల్లే కేంద్రం వీసీపై ఒత్తిడి తెచ్చిందని దీంతో వీసీ ఐదుగురు దళిత విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు వేశారని తెలిపారు. అందులో ఒక విద్యార్థి  ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇప్పటికైనా మిగతా నలుగురిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. కాగా, రోహిత్‌ ఆత్మహత్యకు బీజేపీ నేతలే కారణమని హెచ్‌సీయూ వద్ద విద్యార్థులు ఇవాళ ఆందోళనకు దిగారు. దళిత విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హెచ్‌సీయూలోని ఏబీవీపీ నాయకుడు సుశీల్‌పై దాడి చేశారన్న కారణంతో సరిగ్గా 15 రోజుల క్రితం ఐదుగురు దళిత విద్యార్థులను వీసీ అప్పారావు సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్‌ అయిన విద్యార్థుల్లో దొంత ప్రశాంత్‌, వేల్పుల సుంకన్న, శేషయ్య, విజయ్‌కుమార్‌ లతో పాటు వేముల రోహిత్‌ సైతం ఉన్నారు. పొలిటికల్‌ సైన్స్‌ లో పీహెచ్‌ డీ చేస్తున్న రోహిత్‌ ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో హెచ్‌ సీయూలో విషాదం నెలకొంది. రోహిత్‌ మృతదేహాన్ని తీసుకోపోనీయకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రోహిత్‌ మృతదేహాన్ని ఉస్మానియాకు  పోస్టుమార్టం కోసం తరలించారు. రోహిత్‌ మృతిపై జాక్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎలాంటి వాతావరణం ఉండాలి ? వీసీని సస్పెండ్‌ చేయాలి..అలాగే కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇతరులపై చర్యలు తీసుకోవాలి..కేసులు ఎత్తివేయాలి..సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలి. అప్పుడే తమ సమస్యలు పరిష్కారమౌతాయని జాక్‌ ఆ ప్రకటనలో పేర్కొంది.ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తాము మంగళవారం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం రోహిత్‌ మృతదేహాన్ని గుంటూరుకు తీసుకెళుతామని, తమకు న్యాయం చేయాలని కోరితే లాఠీచార్జీ చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం శాంతియుతంగా నడుస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రోహిత్‌ వేముల లెటర్‌ ఏమి రాశాడో చూడాలని, ఇప్పటివరకు 11 మందిని చంపేశారని పేర్కొన్నారు. ఉరి తాళ్లు, విషం ఇవ్వండి అంటూ రోహిత్‌ విసికి రాసిన లేఖలో  పేర్కొనడం ఎంత ఆవేదన చెందాడో అర్థమౌతుందన్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణలు ఉండడం సహజమేనని, ఇలాంటివి పరిష్కారం చేయాల్సిన బాధ్యత వర్సిటీదేనన్నారు. రోహిత్‌ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *