హైదరాబాద్ : హెచ్ సియూ లో పిహెచ్ డి స్కాలర్, దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని దళిత విద్యావేత్త మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన కేంద్ర మంత్రి దత్తాత్రేయను భర్తరఫ్ చేయాలని, వీసీ అప్పారావు రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేసిన విద్యార్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
‘రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి ‘




