లండన్‌లో దుండగుడి బీభత్సం

4brk-39aలండన్‌: సెంట్రల్‌ లండన్‌లో బుధవారం రాత్రి దుండగుడు బీభత్సం సృష్టించాడు. కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దుండగుడి దాడిలో ఓ మహిళ మృతిచెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలిపారు. నిందితుడికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు ఇంకా వెల్లడించలేదు.