లబ్దిదారులకు ఎన్టీఆర్‌ గృహాలు

లాటరీ ద్వారా కేటాయింపు: మంత్రి

అమరావతి,జూలై26(జ‌నంసాక్షి): చిలకలూరిపేట మార్కెట్‌ యార్డులో పిఎంఎవై ఎన్టీఆర్‌ గృహ నిర్మాణపథకం కింద లబ్ధిదారులకు గృహాలు, ఇళ్ళ నిర్మాణ పత్రాల పంపిణీ గురువారం నిర్వహించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ఎలక్టాన్రిక్‌ డ్రా ద్వారా 1608 మంది లబ్ధిదారులకు గృహాలను కేటాయించామన్నారు. అవకతవకలు, మోసాలు లేకుండా పారిదర్శకంగా ఇళ్ళను లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. అక్టోబర్‌లో 4,512 గృహాలకు చంద్రబాబు చేతుల విూదుగా/ృహ ప్రవేశాలు చేయిస్తామని హావిూ ఇచ్చారు. ఎన్నికల లోపు నియోజకవర్గంలో 8 వేల ఇళ్ళను పూర్తి చేయలన్నదే లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ళను పట్టణ ప్రాంతంలో నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం మంత్రి పుల్లారావు వ్యాఖ్యానించారు.

తాజావార్తలు