Wednesday, 4 November 2026

లిప్టు కింద పడి మహిళ మృతి

నెల్లూరు : ప్రమాదవశాత్తు లిప్టు కింద పడి ఓ మహిళ మృతిచెందింది. అనంతసాగరం మండలం గోవిందమ్మపల్లి గ్రామానికి చెందిన భాగ్యమ్మ అనే మహిళ నెల్లూరులోని రెయిన్‌బో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆదివారం వచ్చింది. అయితే… ఆసుపత్రికి చెందిన లిప్టు కిందపడి మృతిచెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె బంధువులు డిమాండ్ చేశారు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే లిప్టు ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *