తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకులోకి ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. శ్రీలక్ష్మిప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న కోట సురేష్‌కుమార్ (40) లిఫ్ట్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఈ నెల 14న చోటుచేసుకుంది. అయితే ఈ విషయాన్ని అపార్ట్‌మెంట్ వాసులు ఎవరూ గుర్తించలేదు. సురేష్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం లిఫ్ట్ కింది ప్రాంతంలో దుర్వాసన రావడంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు.




