Tuesday, 3 November 2026

లైంగిక నేరాల చట్టం రూపకల్పనకు విపక్షాలు సహకరించాలి : చిదంబరం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి):
లైంగిక నేరాలపై చట్ట రూపకల్పనకు పార్లమెంటులో అందరూ సహకరించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం సూచించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ మహిళలపై లైంగిక నేరాలు అనేవి తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. జస్టిస్‌ వర్మ సిఫారసు చేసిన అన్ని అంశాలకు ఆమోదముద్ర వేశామని అన్నారు. కొన్ని తిరస్కరించినట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రకటించారు. బిల్లులోని జఠిలమైన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించనున్నట్టు తెలిపారు. లైంగిక నేరాలపై తక్షణమే కొత్త చట్టం తేవాలని గుర్తించామని, అందులో భాగంగానే ఆర్డినెన్సు తెచ్చామని అన్నారు. పార్లమెంటు ద్వారానే ఆ బిల్లుకు చట్టరూపం తేనున్నట్టు వెల్లడించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *