– అందరూ ఆహ్వానితులే
– సీఎం కేసీఆర్
మెదక్,డిసెంబర్18(జనంసాక్షి): లోకకళ్యాణం కోసమే తాను ఆయుత చండీయాగాన్ని నిర్వహిన్నట్లు ముఖ్యంత్రి కె.చంద్రశేఖరావు తెలిపారు.శుక్రవారం ముఖ్యంత్రి తాను నిర్వహించబోతున్న ఆయుత చండీయగం గురించి వివరించారు.విశ్వక్షేమం కోసమే అయుత చండీయాగం నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. దీనికి అందరూ ఆహ్వానితులే అని అన్నారు. నియమనిష్టలతో చేపడుతున్న ఈ యాగం శృంగేరి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, అందుకే వారు కఠిన నినర్ణయాలతో దీనిని చేపట్టారని అన్నారు. ఇక్కడికి వచ్చేవారు ఆ నిబంధనలకు లోబడి ఉండాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో చండీయాగం కోసం చేపట్టిన పనులను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కేసీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ… అయుత చండీయాగం డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారని చెప్పారు. ఈ యాగానికి 40 వేల మందిని ఆహ్వానించామని పేర్కొన్నారు. ప్రతిరోజు 50 వేల మందికి ప్రసాదం,, భోజనం అందజేస్తామన్నారు. అయితే ఈ యాగానికి వచ్చే భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని కేసీఆర్ సూచించారు. చండీయాగానికి అందురూ ఆహ్వానితులే అని చెప్పారు. చండీయాగానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించానని… ఆయన వచ్చే విషయంపై స్పష్టత మాత్రం ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు. మహాయాగానికి అందరూ ఆహ్వానితులేనని, ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నారు. ఆరు, ఏడు రాష్ట్రాల నుంచి రుత్వికులు యాగానికి వస్తున్నారని తెలిపారు. ప్రధానంగా 15 వందల మంది రుత్వికులు ఏకకంఠంగా యాగం చేస్తారని వివరించారు. రోజు 50 వేల మందికి పసుపు కుంకుమలు, అమ్మవారి ప్రసాదం అందజేస్తామన్నారు. భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. యాగశాలను 8 వేల నుంచి 9 వేల మంది దర్శించుకునే వీలు ఉంటుందని తెలిపారు. మహిళలు భారీగా వచ్చినా కుంకుమ అర్చనలు చేసుకునే సౌలభ్యం కల్పిస్తామన్నారు. యాగశాలలోకి కంకణధారులకు మాత్రమే ప్రవేశముందన్నారు. ఇక్కడ శృంగేరి పీఠం వారు నియమించే నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. తాను కూడా అందుకు నిబద్దుడనని అన్నారు. వారు ఏది చెబితే అది చేయాల్సి ఉంటుందన్నారు. భక్తులు స్వయం నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. భక్తులు ఎంత సంఖ్యలో వచ్చినా అందరికీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీక్షా వస్త్రాలు ధరించిన వారికి మాత్రమే యాగశాలలోకి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. సుమారు 20వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు చెప్పారు. విూడియాకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వారు అక్కడికే పరిమితం కావాలన్నారు. ప్రతిరోజూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రవచనాలు ఉంటాయన్నారు.





