Wednesday, 4 November 2026

లోపలికి వచ్చే దమ్ము ఇంకెవరికైనా ఉందా!

dogస్పెయిన్: ఎద్దును ర్యాగింగ్ చేయబోయినందుకు ఓ వ్యక్తికి అది చుక్కలు చూపించింది. తన కొమ్ముల వాడి ఎంత ఉంటుందో.. తన ఒంట్లో సత్తువ పవర్ ఏమిటో చూపించింది. అదృష్టం బాగుండి అతడిని బయటకు తీయగలిగారుగానీ లేదంటే దాదాపు అతడి ప్రాణాలు హరీ అనేవి.. అప్పటికే ఎద్దు కొమ్ముల పోట్లకు ఒళ్లంతా హూనం అయి ఆ క్షణాల్లోనే అతడిని ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు కూడా. స్పెయిన్లో ఎద్దులకు రకరకాల పోటీలు నిర్వహిస్తారు. పలు విన్యాసాలు చేయిస్తారు.

బుల్ పైట్ లాగే మరొక ఈవెంట్ కూడా నిర్వహిస్తారు. అదే కేగ్ ర్యాగింగ్. ఒక వ్యక్తి ఇనుప పంజరం లోపల ఉండి ఎద్దును ర్యాగింగ్ చేయడం ఈ ఆటలో భాగంగా చేస్తారు. ఇది ఒక రకంగా వివాదాస్పదమైన గేమ్. ఇందులోభాగంగానే బహిరంగ ప్రదేశంలో ఏర్పాటుచేసిన ఓ ఇనుప పంజరంలోకి ఓ వ్యక్తి వెళ్లాడు. దానికి చుట్టూ ఇనుప కడ్డీలు కూడా ఉన్నాయి. అయితే, దురదృష్టవశాత్తు రెచ్చగొట్టేలా ఉన్న ఓ ఎరుపు రంగు చొక్కా దరించడంతోపాటు దానిని మరింత రెచ్చగొట్టే సిగ్నల్స్ ఇచ్చాడు.

ఎలాగో ఎద్దు లోపలికి రాలేదు అనుకున్నాడు. కానీ.. అతడు చేసిన చేష్టలకు చిర్రెత్తిపోయిన బసవన్న వాడియైన తన కొమ్ములతో ఒక్క కుమ్ముకుమ్మేసింది. దీంతో దానికి ఉన్న ఇనుప రాడ్డు ఇరిగిపోయింది. ఇక అంతే.. లోపలికి దూరిన ఆ ఎద్దు అతడిని పలుమార్లు కొమ్ములపై ఎగరేసింది. పారిపోయే ప్రయత్నం చేసినా ఈడ్చిఈడ్చి పొర్లిచ్చిపొర్లిచ్చి పొడిచే ప్రయత్నం చేసింది. అతడిని ఏదో ఒకలా ఒయటకు తీసి ఆస్పత్రికి పంపించారు. అనంతరం బయటకు వచ్చిన బసవన్న లోపలికి వచ్చే దమ్ము ఇంకెవరికైనా ఉందా అని గాంభీరంగా నిల్చుంది. ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *