వంచనకు మరోపేరు చంద్రబాబు: శిల్పా

కర్నూలు,జూలై4(జ‌నం సాక్షి ): మోసానికి, వంచనకు మారుపేరు చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ నేశిల్పాచక్రపాణి రెడ్డి ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన వంచన మయమని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట తప్పడమే చంద్రబాబు నైజమని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందని విమర్శించారు. నాలుగేళ్లలో అభివృద్ధి శూన్యమని, పాలన గాలికొదిలేసి ప్రజలను దోచుకోవడమే టీడీపీ సర్కార్‌ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హావిూని కూడా నెరవేర్చని ఘనుడని చంద్రబాబుపై విమర్శలు చేశారు. ప్రత్యేక ¬దా సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు చారిత్రాత్మకమని, ఎంపీలు చేసిన త్యాగం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని అన్నారు. 14 నెలల ముందు పదవులను తృణ ప్రాయంగా వదులుకున్న ఘనత తమ పార్టీ ఎంపీలదని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే కేంద్రం దిగొచ్చేదని, కానీ స్వప్రయోజనాలకోసం టీడీపీ ముందుకు రాలేదంటూ మండిపడ్డారు. కమిషన్‌లు ఇస్తే కానీ పనులు జరగని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో టీడీపీ సర్కార్‌ వంచనపై గర్జన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే నాయీ బ్రాహ్మణులను ఉద్యోగులుగా గుర్తిస్తామని, వారికి పార్టీ అండగా ఉంటుందని చక్రపాణి రెడ్డి చెప్పారు.