Thursday, 5 November 2026

వట్టిమాటలు కట్టిపెట్టు ఆధారాలుంటే బయటపెట్టు

రఘునందన్‌కు హరీశ్‌ సవాల్‌
ఆధారాలు బయటపెట్టు : హరీష్‌
హైదరాబాద్‌, మే 17 (జనంసాక్షి) :
వట్టిమాటలు కట్టిపెట్టు, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు.. అని టీిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు సవాల్‌ చేశారు. శుక్రవారం ఆయన టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత రఘునందన్‌రావు ఆరోపణలపై స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రఘునందన్‌ చేసేవన్నీ ఆరోపణలేనన్నారు. ఏవైనా ఆధారాలుగాని, సీడీలుగాని ఉంటే బయటపెట్టాలని కోరారు. లేకుంటే ఆయనపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఏవేవో మాట్లాడితే నిజాలు కాబోవన్నారు. త్వరలోనే ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తాయని.. అప్పుడే ఎవరేమిటో తెలుస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *