– సీనియర్ నేతలతో దిగ్విజయ్ సింగ్ మంతనాలు
హైదరాబాద్, అక్టోబర్29(జనంసాక్షి): వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేఏ అభ్యర్థిపై నిర్ణయం తసీఉకునే విషయంలో కసరత్తు ముమ్మరం చేశారు. జిల్లా కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ గురువారం గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థి ఎంపికపై నేతల అభిప్రాయాలను దిగ్విజయ్ సేకరించారు. ఈ మేరకు పలువురు ఆశావహులు దిగ్విజయ్‌ను కలుసుకున్నారు. అయితే పిసిసి మాజీ ఎంపి వివేక్ పట్ల సానుకూలంగా ఉన్నా మాజీ ఎంపీ వివేక్ …ఈసారి పోటీ చేసేందుకు సముఖంగా లేనట్లు లేదు. ఆయనను పోటీకి ఒప్పించడానికే కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించినా వివేక్ వైఖరిలో మార్పు రాలేదు. తాను పోటీ చేయనని, సర్వే సత్యనారాయణకు టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
మరోవైపు ఓరుగల్లు నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సర్వే సత్యనారాయణ దిగ్విజయ్‌కు తన అభిప్రాయం తెలిపారు. కాగా పీసీసీ నుంచి జాబితా అందుకున్నా అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీ నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను అధిష్టానానికి నివేదించనున్నారు. నేతల తాకిడితో గాందీభవన్ సందడిగా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, శ్రీధర్ బాబు, తదితరులు గాంధీభవన్లో దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. ఇదిలావుంటే వరగంల్‌లో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఇప్పటికే పేర్కొన్నారు.వరంగల్ ఉప ఎన్నికలో ఏకంగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని, ప్రభుత్వ వైఫల్యాలన్ని తమకు అస్త్రాలేనని ఆయన అన్నారు. వరంగల్ ఉప ఎన్నికకు గాను ఐదుగురు అభ్యర్దుల జాబితాను పార్టీ హైకమాండ్ కు ఇప్పటికే ఆయన సమర్పించారు. అయితే ఎక్కువ మంది పెద్దపల్లి మాజీ ఎమ్.పి వివేక్ పై మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. వివేక్ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. దీంతో స్థానికులకు టిక్కెట్ కేటాయిస్తారా లేక నాన్ లోకల్ అయిన సర్వే సత్యనారాయణఫకు టికక్కెట్ ఇస్తారా అన్నది చూడాలి.





