వరంగల్, ఖమ్మం కార్పోరేషన్‌లకు షెడ్యూల్ విడుదల
హైదరాబాద్,ఫిబ్రవరి 21(జనంసాక్షి):గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్‌లకు, అచ్చంపేట పురపాలక సంఘానికి ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. దీనిపై రేపు ఎన్నికల సంఘం నోటీఫికేషన్ విడదల చేయనుంది. రేపటి నుంచి నామినేషన్‌ల ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 24 ఆఖరు తేదీ. నామినేషన్ల స్కూట్నీ 25వ తేదీన నిర్వహిస్తారు. 26వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు ఉపసంహరించుకోవచ్చు. మార్చి 6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 9వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 24 తుది గడువు
ఈ నెల 25న నామినేషన్ల పరిశీలన
ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉప సంహరణకు గడువు
మార్చి 6న ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్
మార్చి 9న ఫలితాలు విడుదల