వరల్డ్‌ కప్‌ క్రికెట్‌లో మరో సంచలనం

విండీస్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయబావుటా ఎగురేసిన ఐర్లాండ్‌
సిడ్నీ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ):  ప్రపంచకప్‌ క్రికెట్‌లో సంచలనాలకు తెరలేచింది. విండీఅస్‌ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ఐర్లాండ్‌ సంచలన విజయం సాధించింది. 2015 క్రికెట్‌ ప్రపంచకప్‌లో పసికూనల సంచలనానికి బీజం పడింది. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొంది తమను తక్కువ అంచనా వేయొద్దని గ్రూపులోని ప్రత్యర్థులకు హెచ్చరించింది. తొలుత బ్యాంటింగ్‌ చేసిన విండీస్‌ 305 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఇప్పటి వరకు ఈ లక్ష్యాన్ని దాటి చేరుకోలేపోయిన శ్రీలంక, ఇంగ్లాండ్‌ , పాక్‌లు ఓటమి పాలయ్యాయి. అయితే అనూహ్యంగా పనికూనలుగా భావించే ఐర్లాండ్‌ మాత్రం విండీస్‌ ఆశలను చిత్తు చేసింది.  పాల్‌ స్టిర్లింగ్‌ 92(84), జాయీసీ 84(67), నెల్‌ ఒబ్రియాన్‌79(60)లు రాణించడంతో కరేబియన్‌ జట్టు నిర్దేశిరచిన 305 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 25 బంతులు ఉండగానే ఐరిష్‌ బృందం చేదించింది. లక్ష్యం భారీగా ఉన్నా ఐర్లాండ్‌ జట్టు ఆది నుంచే దూకుడుగా ఆడుతూ వికెట్‌ కోల్పోకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించింది. ఓపెనర్లు పోర్టర్‌ఫీల్డ్‌, /-టసిర్లింగ్‌లు సంయమనంతో ఆడారు. వీరి జోడిని విడదీయడానికి విండిస్‌ కెప్టెన్‌ ¬ల్డర్‌ అన్ని ప్రయోగాలు చేశాడు. చివరి గేల్‌కు బంతి అప్పగించడంతో 71 పరుగుల వద్ద ఐర్లాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన పోర్టర్‌ ఫీల్డ్‌… రామ్‌దిన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన జాయీసీతో కలిసి స్టిర్లింగ్‌ చక్కని ఇన్నింగ్‌ ఆడాడు. విండీస్‌ బౌలర్లు వీరి జోడిని నిలువరించలేక పోయారు. 92 పరుగులతో దూకుడుగా ఆడుతున్న స్టిర్లింగ్‌… శామ్యూల్స్‌ బౌలింగ్‌లో రామ్‌దిన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో 106 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక మ్యాచ్‌ మన చేతిలోకి వచ్చేసిందనుకున్న కరేబియన్‌ ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. జాయీసీకి నెల్‌ ఒబ్రియాన్‌ తోడవడంతో మరో చక్కని ఇన్నింగ్స్‌ను ఐరిష్‌ ఆటగాళ్లు ఆడారు. విండిస్‌ బౌలర్లకు ఈ జోడీ మరింత ప్రమాదకరంగా మారింది. ఈ సమయంలోనే ఐర్లాండ్‌ బ్యాటింగ్‌ పవర్‌ప్లే  తీసుకుని దూకుడు పెంచింది. 84 పరుగులతో విండిస్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతున్న జాయీసీని… టేలర్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 96 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాటింగ్‌ పవర్‌ప్లేలో ఐరిష్‌ జట్టు కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 50 పరుగులు పిండుకుంది. అప్పటికి ఐర్లాండ్‌ మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. చివర్లో కొద్దిగా తడబడని ఐరిష్‌ ఆటగాళ్లు బల్బేర్నే 9, విల్సన్‌ 1, కెవిన్‌ ఒబ్రియాన్‌ల వికెట్లు కోల్పోయింది. అయితే మూనీ అండతో నెల్‌ ఒబ్రియాన్‌ లాంఛనాన్ని పూర్తి చేసి సంచలన విజయం నమోదు చేశాడు. విండిస్‌ బౌలర్లలో టేలర్‌ మూడు వికెట్లు తీయగా, గేల్‌, శామ్యూల్స్‌లకు చెరో వికెట్‌ దక్కింది.