Monday, 2 November 2026

వానలకు ఢోకా లేదు

untitled-13

– లాలినో ప్రభావం

– 5 నుంచి 10 ఏళ్ల వరకు వర్షాలు

– గోదావరి జలాలను గ్రామాలకు తరలిస్తాం

– రెండేళ్లలో మల్లన్న సాగర్‌ పూర్తి చేస్తాం

– సీఎం కేసీఆర్‌

మెదక్‌,సెప్టెంబర్‌ 28(జనంసాక్షి): ఇక రానునప్న రోజుల్లో అంతా వరదల కాలమేనని, వర్షౄలకు అనుకూలమైన రోజులుల మొదలయ్యాయని సిఎం కెసిఆర్‌ అన్నారు. లాలినో ప్రభావంతో రానున్న ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు వర్షాలు క్రమం తప్పకుండా పడతాయన్నారు. మరో రెండేళ్లలో రాష్ట్రానికి  గోదావరి జలాలు పుష్కలంగా వస్తాయని.. దీంతో నీటికి ఇబ్బందులు తొలగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల అభివృద్ధిపై గ్రామస్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ముందు వూహించినట్లుగానే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయన్నారు. మిషన్‌ కాకతీయ వల్ల చెరువుల్లో నీళ్లు చేరి. భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. ఎర్రవల్లి, సరనస్నపేట ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయని.. ప్రజలు కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. వ్యవసాయాన్ని పద్ధతి ప్రకారం చేసుకుంటూ.. పని విభజన చేసుకుని పంటలు పండించుకోవాలని సూచించారు.త్వరలో కాళేశ్వరం నీళ్లు వచ్చేస్తున్నాయి. మల్లన్న సాగర్‌ కూడా  వచ్చేస్తే కరువు ఉండదు. రెండేళ్లకు సరిపడా నీళ్లు ఉన్నాయి మనకు. విూకు తెలియకుండా చెక్‌ డ్యామ్‌లు చూశాను. చాలా సంతోషం కలిగింది. నరసన్న పేట, ఇటిక్యాల, ఎర్రవల్లిలోని చెక్‌ డ్యామ్‌ లను చూస్తే కడుపు నిండినట్టు ఉంది. పాండురంగంగుంట, మసిరెడ్డిగుంట, నల్లగుంట, ఎర్రగుంటలలో నిండుగా కనపడుతున్నాయని సిఎం కెసిఆర్‌ అన్నారు.  తన దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నరసన్నపేటలో పర్యటించిన ఆయన.. గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. అందరికోసం అందరం ఉన్నప్పుడే అనుకున్న పద్ధతిలో విజయం సాధిస్తామన్నారు. వర్షాల వల్ల ఇళ్ల నిర్మాణంలో కాస్త ఆలస్యం జరిగిందని.. త్వరలో పనులు పూర్తవుతాయన్నారు. గ్రౌండ్‌ వాటర్‌, చెరువుల్లో, కుంటల్లో నీళ్లను సద్వినియోగం చేసుకోవాలి. దానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. మల్లన్న సాగర్‌ గొడవ 2,3 రోజుల్లో పూర్తికావొస్తుందన్నారు. ఈ ఏడాదితో ఎల్‌నినో ప్రభావం పోయింది. ఇప్పుడు లానినో.. వచ్చింది. దీంతో వర్షాలు పడుతూ మరో 12 ఏళ్లు కరువుండదన్నారు.  తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సలంద్రి గ్రామంలో ఐక్యంగా పనిచేసిన విషయం గుర్తు చేశారు. ఎర్రవల్లి, నరసన్నపేటల్లో సలంద్రి మాదిరే ఇక్కడ ఐక్యంగా పనిచెయ్యాలన్నారు.  కలలు కంటే ధనవంతులు కాలేరని కష్టపడితేనే సాధ్యమన్నారు. అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకుంటే వ్యవసాయం బంగారం పడుతుందన్నారు. వాళ్లది మనలాంటి మట్టే.. వ్యవసాయ భూమే. కట్టుబాట్లు పెంచాలి. కట్టుబాట్లుదాడితే ఊరంతా ఫైన్‌ వెయ్యాలి.  ఆడుతుపాడుతూ పనిచేస్తుంటే అలుపుసొలుపూ ఉండదోయ్‌ అనే పాట మాదిరని పనిచేయాలి.  ఇంటిపెత్తనం ఆడాళ్ల దగ్గరుంటే బాగుంటుంది.  రష్యాలో మొన్నటి వరకు 90 శాతం పైలట్లు అమ్మాయిలే. ఇందిరాగాంధీ ఈ దేశాన్ని నడపలేదా.. నడిపిందా లేదా..? మనది కుటుంబ జీవనం.. కుటుంబంగా ఉంటాం. మనం వ్యక్తులం కాదు.. శక్తులం. కుటుంబంగా, ఆర్థికంగా బలంగా ఉంటే.. అంతామంచే జరుగుతుంది. మంచి పని మొదలుపెట్టాం? దేవుడు అండగా నిలిచాడు. అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలరే విూ దగ్గర ఉన్నాడు.. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి.. విూరు అదృష్టవంతులు.. విూరు పిలిచినప్పుడు వస్తాను. అంటూ వారిని ఉత్సాహపరిచారు. ప్రధానంగా స్థానికంగా ఉండే వనరులు

వాడుకొని ఆదర్శ గ్రామాలుగా ఎర్రవల్లి, నర్సన్నపేట మారుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రెండు గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో 50 నుంచి 60 బోర్లు వేయించాలని ఆదేశించారు. ఇక్కడి రైతులు అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అక్కడ పంటలను వేసిన తీరును పరిశీలించినందున వారిని ఆదర్శంగా సాగాలన్నారు.  సంపులకు బోర్లను అనుసంధానం చేసుకుందాం. గోదావరి జలాలు వస్తే రాష్ట్రంలో నీటికి ఇబ్బందులుండవు. 365 రోజులు మన వాగులు, చెరువులు, కుంటలు నిండిఉంటాయి. ముందుగా ఊహించినట్లుగానే ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. చెరువులు, కుంటల్లో నీళ్లు ఆపుకున్నాం. గ్రౌండ్‌ వాటర్‌ బాగా పెరిగే అవకాశముంది. వచ్చే సంవత్సరం కూడా కాలమైతది. అమ్మవారికి దండం పెట్టుకుందాం. వర్షాలు పడుతాయని చెప్పిన.. భగవంతుని దయ వల్ల వర్షాలు పడ్డాయని అంటూ వారిలో భరోసా నింపారు. ఐక్యంగా ఉండడానికి ముందు మక్కజొన్న చేను కోతతో మొదలు కావాలన్నారు. మహళలు ఆర్థికంగా గట్టిగా ఉండాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వాళ్లు ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ బాగా చేస్తారని తెలిపారు. ఆడవాళ్లను ఎప్పుడూ తక్కువ చేయకూడదన్నారు. ప్రేమతో దేన్నైనా జయించొచ్చన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌,జెసి వెంకట్రామి రెడ్డి తదితరలుఉ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *