విశాఖ: వామపక్షాల ఐక్యత కోసం కృషి జరగాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభోత్సవ సభలో పాల్గొని సందేశమిచ్చారు. పేదలు, ధనికుల మధ్య అంతరం పెరుగుతోందని, కార్పొరేట్ల సంపద రోజు రోజుకు పెరుగుతోంది తెలిపారు. ఘర్ వాపసీ పేరుతో మైనార్టీలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. బిజెపి ప్రభుత్వం దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా కులం, మతం పేరుతో విభజించే పినలో పడిందని ఆరోపించారు.




