Wednesday, 4 November 2026

వామపక్ష ఉద్యమాలను బలోపేత చేద్దాం:ఏచూరి

విశాఖ: వామపక్ష ఉద్యమాలను బలోపేత చేద్దామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు సీతారం ఏచూరి పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న సీపీఎం 21వ జాతీయమహాసభ ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. వామపక్ష ఉద్యమాలకు ప్రపంచ దేశాలు మద్దతిస్తున్నాయన్నారు. క్యూబా, అమెరికా మధ్య సహకారం హర్షనీయమన్నారు. అమెరికా తీరుతో క్యూబా ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. సీపీఎం జాతీయ మహాసభలకు శుభాకాంక్షలు తెలుపుతూ క్యూబా, వియత్నాం, రష్యా, పాలస్తీనా, జపాన్ నుంచి వచ్చిన సందేశాల్ని చదివి వినిపించారు. ప్రపంచ వామపక్ష ఉద్యమాలకు ఈ సమావేశాలు వేదిక కావాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *