
దేశవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత
హైదరాబాద్/న్యూఢిల్లీ,జనవరి13(జనంసాక్షి): ఉత్తరభారతంతో పాటు తెలంగాణ, కోస్తాలో చలి ప్రభావం కొనసాగుతున్నది. జనజీవనం, రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. పొగమంచు కారణంగా అనేక ప్రాంతాల్లో రైళ్లు, విమాన ప్రనయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. రోడ్లపై 50 విూటర్ల దూరం వరకు ఏవిూ కనిపించడం లేదు. తీవ్రమైన చలిగాలుల ధాటికి ఉత్తరప్రదేశ్‌లో ఏడుగురు మరణించారు. హవిూర్‌పూర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది. ప్రఖ్యాత మౌంట్ అబూ వద్ద రెండు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. పంజాబ్‌లోని నర్మూన్ ప్రాంతంలో 3.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వగా, కశ్మీర్‌లోయలోని లేహ్‌లో మైనస్ 14.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. అద్భుత పర్యాటక ప్రాంతం దాల్ సరస్సు పాక్షికంగా, ఇతర జల వనరులన్నీ గడ్డకట్టుకుపోయాయి. తెలుగు రాష్టాల్రను చలి తీవ్రస్థాయిలో పంజా విసురుతోంది. విశాఖ మన్యంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. లంబసింగిలో 1 డిగ్రీ, మినుములూరులో 3 డిగ్రీలు, పాడేరు,చింతపల్లిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు రంగారెడ్డి జిల్లా తాండూరులో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్ 9 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగత్రలకు పడిపోయింది. తెలంగాణలో అన్ని జిల్లాల్లో తక్కువ ఉష్ణోగ్రతలున్నాయి. ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడి శీతల గాలులు విదర్భ విూదుగా నేరుగా తెలంగాణను తాకడం వల్ల ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో రెండు రోజులు చలి అధికంగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేక తెలంగాణ వ్యాప్తంగా ఏడుగురు వృద్ధులు మరణించారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు మృతి చెందారు. చలితీవ్రత అధికంగా ఉండంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ విభాగం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీల తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ జిల్లాలో తీవ్రస్థాయిలో శీతలగాలులు వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీచేసింది. మెదక్‌లో 8, ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. రామగుండం, నిజామాబాద్‌ల్లో పది, హైదరాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలో నంద్యాల, కర్నూలు, అనంతపురం, ఆరోగ్యవరం ప్రాంతాల్లో సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.




