Monday, 2 November 2026

వారిద్దరికి భారతరత్నలపై కేసీఆర్‌ హర్షం

-పీవీకి ప్రకటిస్తే బాగుంటుంది

హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనంసాక్షి): మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి,విద్యవేత్త పండిత మదన్‌ మోహన్‌ 2రావు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ గౌరవాన్ని,గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు, బావి తరాలకు ఆదర్శనీయమైన పుట్టిన రోజు కలిగిన ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులకు ఒకేసారి భారతరత్న రావడం యాదృచ్చికమే అయినప్పటికి, ఓమంచి అనుభూతిని కూడా కలిగిస్తున్న దన్నారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో  పాలు పంచుకున్న ఇద్దరూ, వేర్వేరు రంగాల్లో సేవలందించి అత్యున్నత శిఖరాలు అందుకున్నారన్నారు. తెలంగాణ ప్రజల తరుపున, వ్యక్తిగతంగా కూడా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.  ప్రజలందరూ గౌరవించే మ¬న్నత వ్యక్తులకు భారతరత్న గౌరవం ఇవ్వడం దేశానికి కూడా గర్వకారణంగానే ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అభిప్రాయపడ్డారు. అయితే,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన దివంగాత ప్రధాని పివి నర్సింహరావుకు భారతరత్న ప్రకటించపోవడం వెలితిగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. భారతరత్న గౌరవం పొందే అన్ని అర్హతలు పివికి ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికైనా పివికి భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.  వాజ్‌పేయి, మాలవ్యా భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. వాజ్‌పేయి, మాలవ్య భావితరాలకు ఆదర్శమన్నారు. రాష్ట్ర ప్రజల తరపున, వ్యక్తిగతంగానూ కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కూడా భారతరత్న ప్రకటించాలని కేసీఆర్‌ అన్నారు. పీవీకి భారతరత్న కోసం సిఫారసు చేశామని గుర్తు చేశారు. పీవీకి భారతరత్న ప్రకటించకపోవడం వెలితిగా ఉన్నది పేర్కొన్నారు. ఇప్పటికైనా పీవీకి భారతరత్న ప్రకటించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *