వికటించిన విందు భోజనం: ఇద్దరు మృతి

ఏలూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): విందు భోజనం వికటించడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్‌లో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి, విందు భోజనం చేశారు అనంతరం కొద్దిసేపటికే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

 

తాజావార్తలు