వికారుద్దీన్ కాల్చివేతపై సిట్ విచారణ
సీఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్12(జనంసాక్షి) : నల్లగొండ జిల్లా ఆలేరు సవిూపంలో జరిగిన ఎన్ కౌంటర్ పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎన్ కౌంటర్ పై కొన్ని సంస్థలు అనుమానాలు వ్యక్తం చేయడంతో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సిట్ ఏర్పాటుకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా జనగామ, నల్లగొండ జిల్లా ఆలేరు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో వికారుద్దీన్ సహా ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ కోర్టులో విచారణకు వారిని తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది.