విజయవాడ మహానాడుకు భారీగా ఏర్పాట్లు: ఎమ్మెల్యే

విజయవాడ,మే8(జ‌నం సాక్షి):  తెలుగుదేశం మహానాడు కార్యక్రమం ఈసారి విజయవాడ బీఆర్‌ సిద్దార్థ కాలేజీలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ తెలిపారు. నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి 
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ మహానాడు అంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పండుగలాంటిదని అన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఏడాదికి ప్రణాళికలు, భవిష్యత్‌ కార్యాచరణ, దశా దిశ నిర్ధారించుకోడానికి ఇదొక వేదికని బోడే ప్రసాద్‌ అన్నారు. ఎన్నికల ఏడాది కావడంతో టీడీపీ కార్యకర్తలు సమరోత్సాహంతో ఈ కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని బోడే ప్రసాద్‌ తెలిపారు.

తాజావార్తలు