Thursday, 5 November 2026

విజయవాడ రైల్వేస్టేషన్‌లో 20 కిలోల బంగారం పట్టివేత

విజయవాడ,  స్థానిక రైల్వేస్టేషన్‌లో పోలీసులు 20 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. వ్యాపారులు ఈ  బంగారాన్ని  హైదరాబాద్ నుంచి చెన్నై తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. బంగారానికి సంబంధించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బంగారాన్ని అక్రమంగా తరలించడం లేదని, దాని బిల్లులు హైదరాబాద్‌లో ఉన్నాయని వ్యాపారులు మూల్‌చంద్, నిర్మల్ పోలీసులకు తెలిపారు. వెంటనే వాటిని తీసుకురావాలని కోరడంతో వారు హైదరాబాద్ బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *