Thursday, 5 November 2026

విత్తన భాంఢాగారంగా తెలంగాణ – మంత్రి పోచారం

Untitled-4
హైదరాబాద్‌,అక్టోబర్‌27(జనంసాక్షి): తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. విత్తన కంపెనీలు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అందజేయాలని మంత్రి కోరారు. రైతులు లేకుంటే విత్తన కంపెనీల మనుగడేలేదని స్పష్టం చేశారు. మంగళవారం హైటెక్స్‌లో నిర్వహించిన జాతీయ విత్తన సదస్సులోమంత్రి పాల్గొన్నారు.  హెటెక్స్‌లో జాతీయ విత్తన కాంగ్రెస్‌ 8వ సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్య అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. విత్తనోత్పత్తిలో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేట్‌ కంపెనీలు ముందుకొచ్చాయని పోచారం  వెల్లడించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు.  విత్తన ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని పేర్కొన్నారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చి దిద్దుతామని పిలుపునిచ్చారు. ఇప్పటికే సిఎం దీనిపై కసరత్తు చేశారని అన్నారు. ఇక్కడి వాతావరణం ఇందుకు అనుకూలమని అన్నారు. తెలంగాణ రైతులకు అత్యంత లాభసాటిగా ఉండేలా సీడ్‌ పాలసీ తయారు చేస్తున్నామని రాష్ట్ర  తెలిపారు.  తెలంగాణ రాష్టాన్న్రి విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని విత్తనోత్పత్తిలో రైతుల సలహాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశ విత్తనోత్పత్తిలో 60 శాతం తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతోందన్నారు. వ్యవసాయంలో విత్తనోత్పత్తి ప్రధానమైన అంశమన్నారు. 2001లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 196 మిలియన్‌ టన్నులుండగా, 2014లో అది 254 మిలియన్‌ టన్నులకు పెరిగిందని తెలిపారు. తెలంగాణను ప్రపంచానికే విత్తన భాండాగారగా తయారు చేస్తామన్నారు. ఈ సదస్సుకు పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణలు, అధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *