Tuesday, 3 November 2026

విద్యార్థి నేత కన్నయ్యపై లాయర్ల ముసుగులో దాడి

C
-పాటియాల కోర్టు వద్ద ఉద్రిక్తత

– సుప్రీం కోర్టు సీరియస్‌

ఢిల్లీ, ఫిబ్రవరి 17(జనంసాక్షి): కోర్టు ఆవరణలోనే ఒక విద్యార్ధి సంఘం నేతను కొడుతుంటే పోలీసులు చోద్యం చూశారు. పోలీసుల రక్షణను కూడా చేధించుకుని లాయర్ల రూపంలో ఉన్న గూండాలు దాడి చేస్తుంటే.. ఎవరూ ఆపలేకపోయారు. పోలీసుల కస్టడీలోనే ఉన్న ఒక విద్యార్ధి సంఘం నేతపై దాడి చేయగలిగారంటే పోలీసుల మద్దతు లేకుండా చేయగలరా అనే ప్రశ్న వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే పోలీసు కమిషనర్‌ అవకాశం ఇవ్వకుండానే ఇదంతా జరిగిందా అనే ప్రశ్నను అందరూ సంధిస్తున్నారు. చాలా దారుణంగా వారు కొట్టడంతో కన్హయ్య తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అంటే ప్రభుత్వంతోను, అధికారంలో ఉన్న పార్టీతోను, ఆ పార్టీ విధానాలతో వ్యతిరేకిస్తే.. వారి ప్రాణాలకు రక్షణ ఉండదా? ప్రసంగం చేసింది ఒకరు…. నినాదాలు చేసింది మరొకర ప్రసంగం చేసింది ఒకరు. నినాదాలు చేసింది మరొకరు. నినాదాలు చేసినవారి వీడియో దొరికినా.. వారు మాత్రం పోలీసులకు దొరకటం లేదు. ప్రసంగం చేసిన విద్యార్ధి నాయకుడు మాత్రం అరెస్టైపోయారు. అఫ్జల్‌గురు పేరుతో దేశభక్తి వ్యతిరేక భావాలు అంటూ కొందరు గొడవ మొదలెట్టారు. ఏకంగా యూనివర్శిటీలోనే అడ్వకేట్ల రూపంలో వచ్చిన కొందరు జర్నలిస్టులపై దాడి చేశారు. వామపక్ష విద్యార్ధి సంఘ నాయకులపైనా దాడి చేశారు. అంతటితో ఆగకుండా సీపీఎం ఆఫీసుపైనా అటాక్‌ చేశారు. పైగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బెదిరింపు కాల్స్‌ కూడా చేశారు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? మొన్న జర్నలిస్టులపై దాడి చేసినవారే .. నేడు కన్హయ్యపైనా దాడికి దిగారు. వీరంతా ఒకటేనని వీడియోలలో స్పష్టంగా కనపడుతోంది. కన్హయ్య ప్రసంగం చేస్తున్న సమయంలో జాతీయ వ్యతిరేక నినాదాలు ఇచ్చినవారు కూడా కాషాయదళానికి చెందిన విద్యార్ధి సంఘంవారేనని కూడా వీడియోల్లో కనపడుతోంది. అంటే ఇదంతా కాషాయదళం ప్లాన్‌ ప్రకారం పన్నిన పన్నాగమేనని విద్యార్ధి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

జేఎన్‌ యూ నేత కన్హయ పై కేసుకు ఆధారాలు లేవు – ఢిల్లీ పోలీసు స్పెషల్‌ బ్రాంచ్‌

జవహర్‌లాల్‌ నెహ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ కుమార్‌ పై దేశద్రోహం నేరం మోపి ఆదరాబాదరా అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు కేసుకు సంభంధించి ఆధారాలు మాత్రం చూపలేకపోతున్నారు. అసలు కన్హయ కుమార్‌ పాకిస్తాన్‌ కు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వ లేదని ఆరోజు పార్లమెంటు దాడికేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్‌గురు స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమానికి కుమార్‌కు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసు స్పెషల్‌ బ్రాంచ్‌ కేంద్ర ¬ంశాఖకు నివేదిక సమర్పించింది. మావోయిస్టు అనుబంద సంఘం డెమాక్రటిక్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ( ఆూఙ) సభ్యులు అటువంటి నినాదాలు ఇచ్చి ఉంటారని స్పెషల్‌ బ్రాంచ్‌ అంటోంది. అయితే దాని పై కూడా స్పష్టత లేదు. కన్హయ కుమార్‌ అరెస్టుతో దేశ వ్యాప్తంగా నిరసనలు రావడంతో ఈ కేసు మొత్తాన్ని ఆూఙ పైకి మళ్ళించే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆూఙ నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే పోలీసులు చెబుతున్నట్టు ఉమర్‌ ఖలీద్‌ తోపాటు మరికొందరు ఆూఙ నాయకులు ప్రస్తుతం ఆ సంఘంలో లేరని సమాచారం. కొంత కాలంగా వారు ఆూఙ కార్యకలాపాలకు దూర మనట్టుగా తెలుస్తోంది.

జేఎన్‌యూ వివాదంలో పలువురు పోలీసులు బదిలీ

జేఎన్‌యూ వివాదంలో నేపథ్యంలో  13మంది సీనియర్‌  పోలీసులను బదిలీ చేశారు. పాటియాలా కోర్టు వద్ద విద్యార్థులు, అధ్యాపకులు, పాత్రికేయులపై న్యాయవాదులు దాడి చేస్తుంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఇటీవల దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ను పాటియాలా కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో అక్కడ ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. విద్యార్థులు, పాత్రికేయులపై భాజపా మద్దతు న్యాయవాదులు దాడి చేసినట్లు విద్యార్థులు తెలిపారు. సోమవారం పాటియాలా కోర్టు వద్ద న్యాయవాదుల దాడికి సంబంధించిన అంశంపై బుధవారం  సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో పోలీసుల బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. కోర్టు వద్ద జరిగిన దాడిలో గాయపడిన జేఎన్‌యూ పూర్వవిద్యార్థి ఎన్‌డీ జైప్రకాశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పాత్రికేయులు, విద్యార్థులు, అధ్యాపకులపై న్యాయవాదులు దాడికి పాల్పడుతుంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తూ ఉన్నారని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు.

ఘటనపై సుప్రీం ఆగ్రహం

బుధవారం పాటియాలా కోర్టు దగ్గర విూడియాపై దాడి అంశాన్ని సుప్రీం కోర్టు సీరియస్‌గా తీసుకుంది. కోర్టు ప్రాంగణంలో నినాదాలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తపరిచింది. కన్నయ్య రిమాండ్‌పై విచారణ సందర్భంగా కోర్టు గదిలో 20 మందే ఉండాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. విద్యార్ధి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. కన్హయ్యను బుధవారం ఢిల్లీ పటియాలా కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొందరు అతడిని గుర్తుపట్టి బాదేశారు. జెఎన్‌యూలో అఫ్జల్‌ గురు వర్ధంతి సందర్భంగా భారత్‌ను ముక్కలు చేస్తామంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. పాకిస్థాన్‌ జిందాబాద్‌ అనడంతో పాటు భారత్‌ నశించాలి అని విద్యార్ధులు నినాదాలు చేశారు. దీనికి సంబంధించి మిగతా విద్యార్ధులు పరారీలో ఉన్నారు. కస్టడీతో మార్చ్‌ రెండు వరకూ కన్నయ్య జైలులో గడపాల్సిందే.అంతకు ముందు ఈ కేసు విచారణ సమయంలో లాయర్లు వందేమాతరం అంటూ సుప్రీంకోర్టులో నినదించారు. మరోవైపు జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్యకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. కన్నయ్యకు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని… ఆయనపై దేశద్రోహం కేసు పెట్టే సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఇదిలావుంటే పటియాలా హౌస్‌ కోర్టు వద్ద చోటు చేసుకున్న ఘటనలపై కేంద్ర ¬ంశాఖ స్పందించింది. న్యాయవాదులు, విద్యార్థుల ఘర్షణ, విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌, పాత్రికేయులపై దాడి తదితర ఘటనలపై నివేదిక ఇవ్వాలని దిల్లీ పోలీసులను కేంద్ర ¬ంశాఖ ఆదేశించింది.మరోవైపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన జేఎన్‌యూ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ స్పందించింది. ఈ మేరకు కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దిల్లీ పోలీస్‌ కమిషనర్‌, వర్శిటీ రిజిస్ట్రార్‌లకు నోటీసులు జారీచేసింది. వర్శిటీలోకి పోలీసులు ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందో రెండు వారాల్లోగా తమకు తెలియజేయాలని ఆదేశించింది. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 13న ది హిందూ పత్రికలో ప్రచురితమైన కథనం ఆధారంగా కమిషన్‌ స్పందించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని, వర్శిటీలో రెండు గ్రూపుల మధ్య జరగుతున్న వివాదంలో తాను జోక్యం మాత్రమే చేసుకున్నానని కన్నయ్య కుమార్‌ తెలిపినట్లు కమిషన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. పోలీసులు అనాలోచితంగా వ్యవహరించి వర్శిటీలో ప్రవేశించడంతో విద్యార్థులు వారిని తరిమికొట్టారని కమిషన్‌ తెలిపింది.  ఘటన విూడియాలో విస్తృతంగా ప్రసారమైన నేపథ్యంలో పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, విద్యా సంస్థల భావప్రకటన స్వేచ్ఛకు భంగం కల్గించారన్న ఆరోపణలు ఎక్కువగా వెల్లువెత్తుతున్నాయని కమిషన్‌ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *