Tuesday, 3 November 2026

సీఐడీ కస్టడీకి అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌, ఎండీ

ఏలూరు: అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషు నారాయణలు పశ్చిమగోదావరి జిల్లా న్యాయస్థానం అనుమతితో వారం రోజులు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ వేళ ఉదయం 10.30గంటల సమయంలో నిందితులను ఏలూరులోని జిల్లా సబ్‌జైలు నుంచి తరలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు నిమిత్తం వారంరోజులు వారిని ఇక్కడి నుంచి తరలిస్తున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. అయితే సంస్థ యాజమాన్యాలను ఇక్కడి నుంచి తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లు పెద్దఎత్తున జైలుకు వచ్చారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి సంఘటనలు జరుగకుండా వారిని అక్కడి నుంచి పంపించివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *