ఆకివీడు, జనంసాక్షి: విద్యుత్తు తగిలి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆకివీడు పెదపేటకు చెందిన గోడి బాబూరావు (11), గోడి దావీద్(7) వేసవి సెలవులు కావడంతో చేపలు పట్టేందుకు సమోపంలోని కాలువ వద్దకు వెళ్లారు. అదే ప్రాంతంతో విద్యుత్తు వైర్లు చేతికందేంత ఎత్లులో ఉండడంతో పొరపాటున వాటికి తగిలి విద్యుత్ షాక్ తగిలింది. వీరికి సమీపంలో మరో స్నేహితుడు దాసు కంగారుతో కాలువలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు దాసును ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈఘటనలో బాబూరావు,దావీద్ అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల బంధువులు ఆకివీడు సబ్‌స్టేషన్‌కు మృత దేహాలతో వెళ్లి ఆందోళన చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.




