విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ఒంగోలు,అక్టోబర్26(జనంసాక్షి): విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. లింగసముద్రం మండలం మొగిలిచర్లలో విద్యుత్ స్తంభంపై కరెంట్‌షాక్‌తో మధు అనే యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతిని బంధువుల ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.