పెద్దవడుగూరు : అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని తెల్కి గ్రామంలో శ్రీరాంరెడ్డి (45) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సోమవారం ఉదయం తన పొలంలో ఎద్దులతో దుక్కి చేస్తుండగా విద్యుత్ వైర్లు తాకడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు మరో ఎద్దు మృతి చెందింది. సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో ఏఈ మధుసూధన్, ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.




