
ఆలస్యమైతే పరిస్థితి అదుపు తప్పుతుంది : జానా
హైదరాబాద్, జూలై 2 (జనంసాక్షి) :
విద్వేషాలు, వైషమ్యాలు పెరుగకముందే ప్రాంతాలుగా విడిపోయి.. ప్రజలుగా కలిసుందామని మంత్రి జానారెడ్డి సీమాంధ్ర నేతలకు పిలుపునిచ్చారు. సామరస్యానికి, అభివృద్ధికి ఇరు ప్రాంతాల నేతలం ప్రతీకలుగా నిలివాలని విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ కాలంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్య పరిష్కారానికి ఇరు ప్రాంతాల నేతలందరం పరస్పరం అధిష్టానానికి సహకరిద్దామని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లో జానారెడ్డి విూడియాతో మాట్లాడారు. విద్వేషాలకు తావులేకుండా సమస్య పరిష్కరించుకుందామని కోరారు. విభజనకు ఇతర ప్రాంతాల వారు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘంగా ఉన్న సమస్య పరిష్కారానికి సహకరించి, రెండు ప్రాంతాలుగా విడిపోదామన్నారు. ప్రాంతాలుగా విడిపోయి, తెలుగు ప్రజలుగా కలిసుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతమున్న శాంతియుత వాతావరణంలో సమస్యను పరిష్కరించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం విడిపోతే ఎవరికీ నష్టం గానీ, అవమానం గానీ జరగదన్నారు. తెలంగాణ సమస్య ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, సమస్య పరిష్కారానికి సహకరిద్దామని సీమాంద్రులకు సూచించారు. చిన్న రాష్టాల్రు పాలనకు సౌలభ్యంగా ఉంటాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కోసం విడిపోతున్నామన్ని విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. సామరస్యానికి, అభివృద్ధికి ఇరు ప్రాంతాల నేతలు ప్రతీకలు కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తమకుందని, అందుకే ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీలోనే ఉండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నామని చెప్పారు. పరిస్థితులు చేజారక ముందే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకముందే తెలంగాణపై ప్రకటన చేయాలని ఆయన హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు. మోడల్ రాష్టాల్రుగా అభివృద్ధి చెందేందుకు విడిపోదామంటున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఉన్న వారంతా నిశ్చింతగా ఉండవచ్చని, ఎవరికి అవరోధాలు, అవమానాలుండవని తాను హావిూ ఇస్తున్నానని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఒకే నివేదిక తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి యత్నిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
విద్వేషాలు, వైషమ్యాలు పెరుగకముందే విడిపోదాం




