విధినిర్వహణలో బాధ్యతారాహిత్యం సహించేది లేదు
అవసరం లేకుంటే ఉద్యోగాలు వదిలి వెళ్లండి
అధికారులకు కలెక్టర్ కాటమనేని గట్టి హెచ్చరిక
ఏలూరు,జూలై27(జనం సాక్షి): విధి నిర్వహణలో బాధ్యతారహితరగా పనిచేయవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటరనేని భాస్కర్ సరబంధిత ఉద్యోగులకు హితవు పలికారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయితీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో గ్రామాలలో పారిశుద్యర, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి తీరును కలెక్టర్ భాస్కర్ సవిూక్షిరచారు. ఈ సరదర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు నిర్ధేశించిన ప్రాంతాలలో నివాసం ఉండి విధులు నిర్వహిస్తే ఆ గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి అవుతాయన్నారు. అంతే గాని ఉద్యోగం ఒక చోట నివాసం మరొకచోట ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడటమే కాకుండా విధి నిర్వహణలో మానసిక ఒత్తిడి పెరిగి అది వారి ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. తమ విధులు నిర్వహించే ప్రారతాల్లో ఉండకుండా ఉండటంరతో పాటు ఇతర లొసుగులు విూలో ఉన్నందునే గట్టిగా పనిచేయలేకపోతున్నారన్నారు. ఇకపై ఎవరికి నిర్ధేశిరచిన ప్రాంతాల్లో వారు నివాసం ఉంరడకురడా వేరే ప్రాంతాలలో ఉండి విధులు నిర్వహిస్తే చర్యలు తప్పవు అని ఇవో ఆర్‌డి, పంరచాయితీ కార్యదర్శులను హెచ్చరించారు. గ్రామాలకు వెళ్లి విధులు నిర్వర్తించడం కష్టమని భావిస్తే ఉద్యోగాలు విడిచి వెళ్లవచ్చునని అన్నారు. సత్కారాలు, పతకాలకోసం వెంపర్లాడకురడా విధులు నిర్వర్తిస్తే అదే పెద్ద సత్కారమవుతుందన్నారు. విధి నిర్వహణెళి దైవంగా భావించి జవాబుదారితనరతో పనిచేస్తే ప్రజల అభిమానాన్ని పొందవచ్చునని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో మురుగు డ్రైయిన్లు పరిశుభ్రర పరిచే కార్యక్రమాలను ముమ్మరర చెయ్యాలని ఈ విషయరలో అలసత్వర వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామాల్లో చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడంతోపాటు ఆయా గృహాల నురడి చెత్త చేకరించే సమయరలో ఆర్‌ఐడిఎఫ్ టాగ్‌లను స్కానిరగ్ చెయ్యాలని ఆదేశించామని ఈ విషయంలో నిర్లక్ష్యర కనపడుతుంరదన్నారు. ఆగష్టు నెల నుండి ఈ విషయంలో 50 శాతం కన్నా తక్కువ పనితీరు కనబరిచిన, సెప్టెంబర్‌నుండి 90శాతం కన్నా తక్కువ పనితీరు కనిపించిన పంచాయితీ కార్యదర్శుల జీతాలు నిలుపుదల చేయడం తధ్యం అని ఆయన అన్నారు. జిల్లాలో 909 గ్రామ పంచాయితీలో ఎల్‌ఇడీ వీధి దీపాల ఏర్పాటు పనులను అక్టోబర్ 2 గారధీ జయంతి నాటికి పూర్తి చెయ్యాలన్నారు. జిల్లాలో గత నాలుగేళ్లగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్డులను నిర్మించేరదుకు నిధులు మంజూరు చేసినప్పటికి ఇంకా వాటిని పూర్తి చేయకపోవడరతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తర చేసారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణర లక్ష్యాలను రెరడు సంవత్సరాలలో ఎరపిడివోలు పూర్తి చేసి ఒడిఎఫ్ జిల్లాగా తీసుకువచ్చినప్పుడు పై కార్యక్రమాన్ని ఇఒపిఆర్‌డిలు ఎరదుకు చెయ్యలేకపోతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. గ్రామాల్లో అనుమతి లేకురడా లేఅవుట్‌లు వచ్చిన, ఎ/-లాన్‌కి విరుద్ధరగా ఇళ్ళ నిర్మాణర జరిగిన, ఇరటి ఎ/-లాన్ లేకురడా ఇళ్ల నిర్మాణర జరిగిన పంచాయితీ కార్యదర్శులు సస్పెండుకు గురికాక తప్పదని హెచ్చరిరచారు. ఈ సమావేశానికి హాజరుకాకపోవడంతో పాటు డీపీవో, ఎమ్‌డీవో, డివిజినల్ పంచాయితీ అధికారులకు ఎవ్వరికి కూడా మురదస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఏలూరు ఎంపిడీవోపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా పరచాయితీ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి డీపీవో, జిల్లా పరిషత్ సీఇవో నాగార్జున సాగర్, పలువురు డివిజినల్ పంచాయితీ అధికారులు ఇవో ఆర్డీలు పాల్గొన్నారు.